Mobile Popup Ad
Mobile Popup Ad

సోదరి అస్థిపంజరంతో బ్యాంక్‌కు.. ఎందుకో తెలుసా ?

కలం, వెబ్‌ డెస్క్‌ : ఒడిశా (Odisha) రాష్ట్రంలో మనసు కలిచివేసే దారుణ ఉదంతం వెలుగుచూసింది. చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న 19,300 రూపాయల కోసం ఒక వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. జితు ముండా అనే వ్యక్తి తన సోదరి మరణించిన విషయాన్ని బ్యాంకు మేనేజర్‌కు వివరించినప్పటికీ నిబంధనల పేరుతో నగదు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.

సోదరి అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా డబ్బు అందక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ వ్యక్తికి మరో దారి కనిపించలేదు. శ్మశానంలో పూడ్చిపెట్టిన సోదరి అవశేషాలను తవ్వి తీసిన జితు ముండా.. సుమారు మూడు కిలోమీటర్ల మేర నడకన ప్రయాణించి ఒడిశా గ్రామీణ బ్యాంకుకు చేరుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>