కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ (Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు ఆదేశించారు. వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన శుక్రవారం ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ పై (Mobilization of Resources) కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఆదాయ మార్గాలను మెరుగుపరచడం, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలను అన్వేషించడంపై కమిటీ దృష్టి సారించింది.
శాఖల వారీగా సమీక్షలో భాగంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, ఇతర కీలక శాఖల ద్వారా వస్తున్న ప్రస్తుత ఆదాయాన్ని మంత్రుల బృందం సమీక్షించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు వ్యూహాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. సమర్థవంతమైన పాలన ద్వారా ఆర్థిక వనరులను గరిష్టంగా వినియోగించుకోవడమే లక్ష్యమని భట్టి (Bhatti Vikramarka) స్పష్టం చేశారు.
Read Also: ’కన్నుకు కన్ను‘.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Follow Us On: Instagram

