కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను (IPS Officers) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులో అత్యంత కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ బి.సుమతిని మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఇక, హోం శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా శిఖా గోయల్, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా డాక్టర్ తరుణ్ జోషి, SIB ఇంటెలిజెన్స్ చీఫ్ గా కార్తికేయ, ఏసీబీ డైరెక్టర్ గా అవినాష్ మొహంతి, హైదరాబాద్ కేంద్రంగా ఉండే మల్టీజోన్–2 ఐజీగా షాహనవాజ్ ఖాసీం నియమితులయ్యారు.
కొత్త డీజీపీ ఆయనేనా..
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఈ నెల 30వ తేదీతో రిటైర్డ్ కాబోతుండగా.. నూతన డీజీపీగా సీవీ.ఆనంద్ ను నియమించడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగా.. తాజా బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయల్ ను నియమించారు.
Read Also: ఆర్టీసీ నిర్ణయాలపై కచ్చితంగా చర్చిద్దాం: భట్టి
Follow Us On: Sharechat

