కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు.. రాజీనామా బాటలో 10 మంది ఎమ్మెల్యేలు

కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఆ పార్టీకి తీవ్ర షాక్‌నిచ్చింది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన విజయపుర (ఇండి) కాంగ్రెస్ ఎమ్మెల్యే యశవంత్ రాయగౌడ్ పాటిల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమోదం కోసం స్పీకర్‌కు పంపగా, ఆయన బాటలోనే సాగర ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పుకున్నారు. రాబోయే రోజుల్లో వారి బాటలో మరో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>