Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు మోదీ రాక.. రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోదీ టూర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీ వరాలను మోదీ ప్రకటించనున్నారని, మొత్తం రూ. 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ సిటీని ప్రధాని (PM Modi) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రధాని రాకతో తెలంగాణ అభివృద్ధికి కొత్త వేగం పుంజుకుంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏమాత్రం కొరత లేదు: కిషన్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>