epaper
Sunday, March 1, 2026
epaper

అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ప్రారంభం

కలం, సినిమా : ఇండియన్ సినిమా రంగంలో సాంకేతికంగా మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios) లో భారతదేశంలోనే అతిపెద్ద మోషన్, పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ స్టేజ్‌గా నిలిచే A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ప్రారంభమైంది. ఈ అత్యాధునిక సదుపాయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) ప్రారంభించారు. ఈ ల్యాబ్‌ను మిహిర విజువల్ ల్యాబ్స్ (Mihira Visual Labs) తో కలిసి సాంకేతిక భాగస్వామిగా Animatrik సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక మోషన్ క్యాప్చర్ స్టేజ్ ద్వారా సినిమాలు, గేమింగ్ రంగాల్లో ప్రీవిజువలైజేషన్ నుంచి ఫైనల్ యానిమేషన్ వరకు వేగంగా, ఖచ్చితంగా బడ్జెట్‌కు అనుగుణంగా కంటెంట్ తయారు చేయడం సాధ్యమవుతుంది.

అయితే ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సహాయంతో ‘వారణాసి’ (Varanasi) మూవీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు రాజమౌళి తెలిపారు. ప్రపంచ స్థాయి  టెక్నాలజీ కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సి వచ్చేదని.. ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ప్రారంభం కావడంతో ఆ రేంజ్ టెక్నాలజీ సదుపాయం హైదరాబాద్‌‌(Hyderabad)లోనే అందుబాటులోకి వచ్చిందని దర్శకుడు రాజమౌళి (Rajamouli), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలిపారు. ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనే దర్శకులకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!