epaper
Monday, March 2, 2026
epaper

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం : ప్రధాని మోడీ

కలం, డెస్క్ : ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇజ్రాయెల్ దేశానికి పూర్తి అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ  (Narendra Modi) ప్రకటించారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా.. ఆ దేశ పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం ఎక్కడున్నా అంతమొందిస్తాం. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఇజ్రాయెల్ తో పాటు ఇండియా ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. టెర్రరిజం ఎక్కడున్నా నిర్మూలించేందుకు భారత్ సహకరిస్తుంది’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తెలిపారు.

ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. ‘ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి ప్రధాని నేనే. ఇజ్రాయెల్ తో 140 కోట్ల మంది భారతీయుల స్నేహం ఉంది. ఇజ్రాయెల్ కు రెండో సారి రావడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. టెర్రరిజంపై ప్రపంచమంతా కలిసి పోరాడాలి. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదమే. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ ముందు ఉంటుంది’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

ఇజ్రాయెల్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇండియాతో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడని.. ఇండియాను స్పీడ్ గా డెవలప్ చేస్తున్నారంటూ కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!