‘బాబోయ్.. ఇక్కడ ఉండలేం!’.. అమెరికా వద్దంటున్న భారతీయులు

కలం, వెబ్ డెస్క్: ట్రంప్ ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడయ్యాడో.. అప్పటి నుంచి అక్కడ ఉంటున్న భారతీయులకు (Indians) కష్టాలు మొదలయ్యాయి. గ్రీన్ కార్డు దారులను సైతం వదిలిపెట్టకుండా అనేక రకాల ఆంక్షలతో ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, హెచ్1బీ వంటి వీసాల మీద వెళ్లిన వారి పరిస్థితి అయితే మరీ దారుణం. ‘అసలు మీరు మా దేశంలోకి ఎందుకు వస్తున్నారంటూ’ సూటిగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో, ‘బాబోయ్.. ఇక్కడ ఉండలేం.. మేము వెళ్లిపోతాం’ అంటున్నారట ఇండియన్స్. ఇటీవల కార్నెగి ఎండోమెంట్‌ అనే ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే చేయగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒకటి కాదు.. ఎన్నెన్నో కారణాలు..

అమెరికాలో సుమారు 54 లక్షల మంది భారతీయులున్నట్లు అంచనా. మొత్తం జనాభాలో వీరి శాతం 1.5 శాతం మాత్రమే. అయితే, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్, మొదటగా భారత్ వంటి దేశాల నుంచి వస్తున్నవారిపైనే గురి పెట్టారు. నిబంధనలు పాటించడం లేదని, వీసా గడువు ముగిసిపోయిందని, ఒక పని కోసం వచ్చి మరొకటి చేస్తున్నారని.. ఇలా రకరకాలతో ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడు. దీంతో, అమెరికాలో ఉండే పరిస్థితులు లేవని 40 శాతం భారతీయులు నిర్ణయానికి వచ్చారట. వీలైనంత త్వరగా అమెరికాను వదిలేసి సొంత దేశం వెళ్లిపోవడమో.. లేదా మరో కంట్రీ చూసుకోవడమో ప్లాన్ చేసుకుంటున్నారని సర్వే రిపోర్ట్ తెలుపుతోంది. మరోవైపు, అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయినట్లు పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>