దేవుడికి దండం పెట్టి.. ఆపై స్వామివారి నగలతో పరార్!

కలం, వెబ్ డెస్క్: దేవుడికి భక్తిగా దండం పెట్టి.. ఆపై వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన వింత చోరీ ఘటన రాజస్థాన్ (Rajasthan) లోని భిల్వారా (Bhilwara) జిల్లాలో వెలుగుచూసింది. మండల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మోహన్ కాలనీలో ఉన్న ప్రసిద్ధ సన్వదియా సేఠ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది.

పూజారి నిత్య పూజా కార్యక్రమాలు ముగించుకుని, గర్భగుడికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. అనంతరం ఒక అపరిచిత వ్యక్తి చాలా సాధారణంగా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన దొంగ నేరుగా విగ్రహం వద్దకు వెళ్లకుండా, నిజమైన భక్తుడిలా భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత దేవుడి ముందు నిలబడి చేతులు జోడించి మొక్కాడు.

భక్తి నటన ముగిసిన వెంటనే, చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడి వెలుపల ఉన్న మెటల్ గ్రిల్ తలుపును తెరిచాడు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే స్వామివారి ఒంటిపై ఉన్న వెండి కిరీటం, కడియాలు, వేణువును తన బ్యాగులో పెట్టుకున్నాడు. ఈ చోరీ దృష్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్​టంగా రికార్డయ్యాయి. పూజారి తిరిగి ఆలయ తలుపులు తెరవడానికి వచ్చినప్పుడు విగ్రహంపై నగలు లేకపోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>