మురసు తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో ఎన్నికలపై ఎస్‌ఈసీ క్లారిటీ!

కలం, వెబ్ డెస్క్ : మురసు తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను (AP Elections) యథావిధిగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికలను నిలిపివేయడానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంతో, తుఫాన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ జరగనుంది. అయితే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ సాధ్యాసాధ్యాలపై ఎస్‌ఈసీ వివరాలు సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గుంటూరు జిల్లాలో మురసు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో కొన్ని మండలాల్లో పోలింగ్‌ను వాయిదా వేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు.

మరోవైపు, తుఫాన్ ప్రభావం లేని ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది విషయంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది అందరూ ఎలాంటి అలసత్వానికి తావులేకుండా తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>