Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్!

కలం, వెబ్ డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం సినిమాల విషయంలో వేగం తగ్గించింది. కానీ తన పర్సనల్ లైఫ్‌తో మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 35 ఏళ్ల ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం పెద్దగా ప్రాజెక్టులు లేవు. ఆమె తన సమయాన్ని సీక్రెట్ డేటింగ్‌తో గడిపేస్తోందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (Rohan Mehra) ప్రేమలో ఉందని, వీరిద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ పరంగా కాస్త గ్యాప్ దొరకడంతో పూజా తన కొత్త రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>