కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన వేళ మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అరేబియా గల్ఫ్ తో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని ఇరాన్ పోర్టులను దిగ్భంధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ చమురు రవాణాకు ముఖ్య కేంద్రమైన హార్మూజ్ జలసంధిలో హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ అందుతోంది. హార్మూజ్ జలసంధిలో 15 భారత నౌకలు (Indian Ships) నిలిచిపోయాయి.
ఈ మేరకు భారతదేశానికి వస్తున్న గ్యాస్ కారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా హార్మూజ్ జలసంధిలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 20,400 టన్నుల ఎల్‌పీజీని మోసుకొస్తున్న ”జగ్ విక్రమ్” కూడా ఉంది. ప్రస్తుత గ్యాస్ సంక్షోభ సమయంలో ఇంత పెద్ధ మొత్తంలో ఇంధనం రావడం దేశీయ అవసరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కానీ ప్రస్తుతం హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్భంధించడంతో ఈ నౌక రవాణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 15 భారతీయ నౌకలను (Indian Ships) తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, నౌకలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపై కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. ”జగ్ విక్రమ్” నౌక ఏప్రిల్ 14న గుజరాత్ లోని కాండ్లాకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవి రేసులో ఆది శ్రీనివాస్!
Follow Us On: Instagram

