Mobile Popup Ad
Mobile Popup Ad

4 గంటలు ఫుడ్ డెలివరీ.. 6 లక్షలు సంపాదించిన ఇండియన్ గర్ల్

కలం, వెబ్ డెస్క్: ఈతరం యువత ఒకవైపు తమ లక్ష్యాల కోసం కష్టపడుతూనే.. మరోవైపు పార్ట్ టైం డ్యూటీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో (Australia) నివసిస్తున్న ఓ ఇండియన్ అమ్మాయి నాలుగు గంటలపాటు ఫుడ్ డెలివరీ (Food Delivery) చేయడం ద్వారా ఏకంగా 7,850 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.6.5 లక్షలు) సంపాదించింది. సాధారణంగా డెలివరీలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం అసాధ్యం. కానీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఆమె భారీ మొత్తంలో ఆదాయాన్ని ఎలా సాధించిందో వివరించింది. ఆ సమయంలో డెలివరీ ఆర్డర్లు చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, టిప్స్ కూడా ఊహించనివిధంగా ఉన్నాయని తెలిపింది. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆనందపడింది. ఈ వార్త చదివిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె కష్టాన్ని, అదృష్టాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఆస్ట్రేలియాలో (Australia) డెలివరీ రంగంలో ఉన్న అవకాశాల గురించి ఆరా తీస్తున్నారు. విదేశాల్లో పార్ట్-టైమ్ పనులు చేసే భారతీయ విద్యార్థులు ఇది మంచి అవకాశంగా మారనుంది.

Read Also: సంచలనం.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>