సౌదీలోని భార‌తీయుల‌కు అల‌ర్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సౌదీ అరేబియాలో ఉంటున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సూచించింది. ఈ మేర‌కు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక ప్రభుత్వం, ఎంబసీ జారీ చేసే భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. ప్రస్తుతం రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్, వీఎఫ్ఎస్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. భారత్‌కు వెళ్లాలనుకునే వారు అందుబాటులో ఉన్న విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చని, జెడ్డా, మదీనా నుంచి విమానాలు సాధారణంగానే నడుస్తున్నాయని తెలిపింది.

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సంప్రదించడానికి ఎంబసీ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపింది. రియాద్‌లోని వారు 800 247 1234 లేదా 00-966-542126748 నంబర్లకు, జెడ్డాలోని వారు 800 244 0003 లేదా +966 536209704 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే ఎంబసీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>