కలం, వెబ్ డెస్క్: ముంబైలోని (Mumbai) రామ్ మందిర్ రైల్వే స్టేషన్‌లో ‘3 ఇడియట్స్’ సినిమాను తలపించేవిధంగా అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. స్టేషన్‌లో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ డాక్టర్లు అందుబాటులో లేరు. అదే సమయంలో ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో స్పందించాడు. తను డాక్టర్ కాకపోయినప్పటికీ వెంటనే డాక్టర్ అయిన తన భార్యకు వీడియో కాల్ (Video Call) చేశాడు. ఆమె సూచనలు పాటిస్తూ ఆ గర్భిణీకి విజయవంతంగా ప్రసవం చేశాడు. ఆ వ్యక్తి చూపిన చాకచక్యంతో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసించారు. రియల్ హీరో అంటూ కామెంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఏపీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
Follow Us On : WhatsApp

