Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌.. భారత జట్టు ప్రకటన

కలం, వెబ్‌ డెస్క్‌ : ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 2026 మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును (Women T20 World Cup) అధికారికంగా ప్రకటించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చీఫ్ సెలెక్టర్ అమితా శర్మ, సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ కార్యక్రమంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. అంతకుముందు జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ చర్చించి తుది జట్టును ఖరారు చేశారు. ఇదే జట్టు మే 28 నుండి జూన్ 2 వరకు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లోనూ తలపడనుంది.

భారత జట్టు ఇదే :

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. జట్టులో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్ చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్, భారతి ఫుల్మాలి, వికెట్ కీపర్ యస్తికా భాటియా, నందిని శర్మ, రాధా యాదవ్ ఎంపికయ్యారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>