కలం, స్పోర్ట్స్ : భారత కుర్రాల్ల పవర్ పంచెస్‌కు తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (Asia U17 Boxing Championship) షేకవుతోంది. భారత కుర్రోళ్లు పవర్‌ఫుల్ పంచులతో పతకాలను కూడా ఒడిసిపట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రింగ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఏకంగా ఐదుగురు బాక్సర్లు సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లారు. దీనివల్ల భారత ఖాతాలో కనీసం ఐదు పతకాలు రావడం ఇప్పుడు ఖాయమైపోయింది. టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 50 కిలోల విభాగంలో యశ్ యాదవ్ కిర్గిస్థాన్ బాక్సర్‌పై అద్భుత విజయం సాధించారు. అలాగే, 54 కిలోల విభాగంలో నివేష్ పాల్ జపాన్ బాక్సర్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు.
ఇక 70 కిలోల విభాగంలో నమన్ కుమార్, 75 కిలోల విభాగంలో లక్షయ్ ఫోగట్ తమ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఏకగ్రీవ విజయాలతో ముందడుగు వేశారు. గురువారం నాటి ఫలితాలతో మొత్తం ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరి మెడల్స్ ఖాయం చేసుకున్నట్లయింది. అయితే కొందరు బాక్సర్లకు ఈ టోర్నీలో (Asia U17 Boxing) నిరాశ ఎదురైంది. 60 కిలోల విభాగంలో కరుణ్ ఆల్బర్ట్‌సన్, 66 కిలోల విభాగంలో రణవీర్, అలాగే 80 కిలోల ప్లస్ విభాగంలో సిద్ధాంత్ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Read Also: యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు నాడా నోటీసులు.. జరిగిందిదే..!
Follow Us On: WhatsApp

