Mobile Popup Ad
Mobile Popup Ad

అధిక వ‌డ్డీ ఆశ చూపి రూ.30 కోట్ల మోసం..!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప‌శ్చిమ గోదావ‌రి (West Godavari) జిల్లాలో భారీ వ‌డ్డీ మోసం వెలుగు చూసింది. ఓ మ‌హిళ అధిక వ‌డ్డీల‌ను ఆశ చూపి సుమారు 30 మంది నుంచి కోట్లాది రూపాయ‌లు కొట్టేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌ణుకుకు చెందిన స్నేహ‌ల‌త‌, అంజూరి దుర్గా ప్ర‌సాద్ అనే వ్య‌క్తులు ఇద్ద‌రూ అధిక వ‌డ్డీతో పాటు త‌క్కువ ధ‌ర‌కే బంగారం ఇస్తామ‌ని చెప్పి బాధితుల ద‌గ్గ‌ర నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేశారు. మొద‌ట్లో కేవ‌లం ప‌ది రోజుల‌కే వ‌డ్డీలు చెల్లించిన నిందితులు త‌ర్వాత రోజులు, నెల‌ల త‌ర‌బ‌డి వ‌డ్డీ ఇవ్వ‌కుండా ముఖం చాటేయ‌డంతో బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

ఈ మోసానికి సంబంధించి ప్ర‌స్తుతం స్నేహ‌ల‌త ఆడియో కాల్ రికార్డింగ్ ఒక‌టి వైర‌ల్‌గా మారింది. త‌న‌ను మీడియా కానీ, పోలీసులు కానీ ఏమీ చేయ‌లేరంటూ ఆమె పొగ‌రుగా మాట్లాడ‌టం బాధితుల్లో మ‌రింత ఆందోళన రేకెత్తిస్తోంది. 2023 నుంచి వీరికి ఒక్కొక్క‌రు సుమారు రూ.40 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు అంద‌జేశారు. ఇప్పుడు డ‌బ్బులు వ‌స్తాయో లేదోన‌ని బాధితులు ల‌బోదిబోమంటున్నారు. తమకు న్యాయం జరగకుంటే చావే శరణ్యమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి స్నేహ‌ల‌త‌పై చ‌ర్య‌లు తీసుకొని, త‌మ డ‌బ్బు త‌మ‌కు ఇప్పించాల‌ని బాధితులు కోరుతున్నారు.

Read Also: సైబర్ క్రైమ్.. చదువుకున్నవాళ్లకి తెలంగాణ పోలీస్ అలర్ట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>