Mobile Popup Ad
Mobile Popup Ad

సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు

కలం, వెబ్ డెస్క్ : విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్‌పోర్టు ఫీజులను (Passport Fee Hike) భారీగా పెంచుతూ కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.1500 నుంచి రూ.2500కు , అలాగే 60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజును రూ. 2000 నుంచి రూ.3500కు పెంచింది. అలాగే 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5,000కు , 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.6000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

పాస్‌పోర్టులో పేజీల ఉపయోగం ఇలా..

ఏదైనా దేశానికి వెళ్లినప్పుడు , ఆ దేశానికి సంబంధించిన వీసా స్టాంప్ వేయడానికి, అలాగే ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్‌లో వేసే ఇమ్మిగ్రేషన్ స్టాంపుల కోసం పాస్‌పోర్టులో పేజీలు ఉపయోగపడతాయి. 10 ఏళ్ల వ్యాలిడిటీలో ఒకటి , రెండు సార్లు మాత్రమే విదేశాలకు వెళ్లే వారైతే 36 పేజీల పాస్‌పోర్ట్ సరిపోతుంది. అదే తరచూ విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు 60 పేజీలు పాస్‌పోర్ట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>