epaper
Wednesday, February 18, 2026
epaper

వారమే గడువు.. పాక్​ సైన్యానికి బీఎల్​ఏ వార్నింగ్​

కలం, వెబ్​డెస్క్: పాకిస్థాన్​ సైన్యానికి బలూచిస్థాన్ ​లిబరేషన్​ ఆర్మీ వార్నింగ్​ ఇచ్చింది (Balochistan)​. పాక్​ ఆర్మీ వద్ద బందీగా ఉన్న బలూచ్​ పోరాట యోధులను వారంలోగా విడుదల చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ దగ్గర బందీలుగా ఏడుగురు పాక్​ సైనికులను చంపేస్తామని, అనంతరం ‘హెరోఫ్​ 2’ రెండో దశ స్టార్ట్ చేస్తామని అల్టిమేటమ్​ జారీ చేసింది. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా ఆదివారం బలూచ్ లిబరేషన్​ ఆర్మీ తమ డిమాండ్లతో కూడిన గడువును పాక్​ ఆర్మీని ఉద్దేశిస్తూ పోస్ట్​ చేసింది.

కాగా, పాకిస్థాన్​ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న బీఎల్​ఏ(BLA).. ఇటీవలే హెరోఫ్​ 2 పేరుతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాక్​ సైన్యంతోపాటు అధికారులను, ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు, ఆత్మాహుతి దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో ఇరువైపులా దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాక్​ సైన్యం కొంత మంది బీఎల్​ఏ సభ్యులను బందీలుగా చేసుకోగా, ప్రతిగా బీఎల్​ఏ సైతం కొంతమంది పాక్​ సైనికులను అదుపులోకి తీసుకుంది.

మొత్తం 17 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని చెప్పిన బీఎల్​ఏ.. వీరిలో 10 మందిని విడుదల చేసింది. మిగిలిన ఏడుగురిని విడుదల చేయాలంటే పాక్ సైన్యం అదుపులో ఉన్న తమవాళ్లను విడిచిపెట్టాలని కోరుతోంది. ఈ మేరకు వారం రోజుల గడువు ఇస్తూ బీఎల్​ఏ (Balochistan) మీడియా వింగ్​ హక్కాల్​కు చెందిన జాయెద్​ బలూచ్​ ఓ పోస్ట్​ను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అయితే, దీనిపై పాక్​ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

Read Also: రాజకీయ స్థిరత్వంతోనే ట్రేడ్​ డీల్స్​ : ప్రధాని మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>