Mobile Popup Ad
Mobile Popup Ad

కోహ్లీ పరుగుల వేట.. అసలు రహస్యం ఇదే!

కలం, వెబ్ డెస్క్: సాధించాలనే తపన, అంకితభావం ఉంటే ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా రాణించవచ్చు. అందుకే ఉదాహరణే కింగ్ కోహ్లీ (Virat Kohli). ప్రస్తుతం అతడు రికార్డుల కోసమో, ప్రశంసల కోసమో ఆటను కొనసాగించడం లేదు. తన వృత్తి పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకితభావమే కోహ్లీని ముందుకు నడిపిస్తున్నాయని క్రికెట్ క్రిటిక్స్ భావిస్తున్నారు. ఇటీవల కాలంలో కోహ్లీలో ఆధ్యాత్మిక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీసీఐతో జరిగిన కొన్ని వివాదాలు, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆటను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం అతను కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారిస్తూ, ఐపీఎల్‌ను తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఓ వేదికగా భావిస్తున్నాడు. డబ్బు, కీర్తి కంటే తన ఆటలో నిజాయితీగా ఉండటమే ముఖ్యమని కోహ్లీ నమ్ముతున్నాడు.

ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సాధించిన అద్భుత సెంచరీ కోహ్లీలోని (Virat Kohli) పట్టుదలకు నిదర్శనం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ, ఆ ఒత్తిడిని అధిగమించి 105 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 37 ఏళ్ల వయస్సులో కూడా మైదానంలో కోహ్లీ చూపే ఉత్సాహం 25 ఏళ్ల యువకుడిలా ఉంటుందని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ‘క్రికెట్ అనేది నా జీవితం, ఇది ఎప్పటికైనా ముగిసిపోతుంది. అందుకే మైదానంలో ఉన్న ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను’ అని కోహ్లీ తన మనసులోని మాటను పంచుకున్నాడు. ప్రశంసలు లేదా విమర్శల గురించి ఆలోచించకుండా తన ఆటపైనే పూర్తి దృష్టి పెట్టడమే కోహ్లీ ప్రత్యేకత.

Read Also: కింగ్ కోహ్లీ వన్ మ్యాన్ షో: రాయ్‌పూర్‌లో కేకేఆర్ చిత్తు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>