కలం, వెబ్ డెస్క్: భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన డ్రోన్ మిస్సైల్స్ (India Drone Missiles) త్వరలోనే భారత సైన్యంలో చేరనున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) సహకారంతో, గుజరాత్‌లోని వడోదర టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వీటిని అభివృద్ధి చేసింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా శత్రువుల స్థావరాలను కచ్చితత్వంతో ఛేదించడం వీటి ప్రత్యేకత. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ డ్రోన్లు, రక్షణ రంగంలో భారత్ లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also: కేరళ సీఎంగా వీడీ సతీశన్.. సీఎం రేవంత్ విషెస్
Follow Us On: X(Twitter)

