Mobile Popup Ad
Mobile Popup Ad

ఎబోలా వైరస్.. కీలక అడ్వైజరీ జారీ చేసిన భారత్

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా వైరస్ (Ebola Virus) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశ ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప విదేశాలకు ప్రయాణించవద్దని కేంద్రం సూచించింది. ముఖ్యంగా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో ప్రాణాంతకమైన బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించడంతో కేంద్రం భద్రతలు కట్టుదిట్టం చేసింది.

వేగంగా వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో ఎబోలా..

ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ లోఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో బుండిబుగ్యో రకం ఎబోలాను ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ గా ప్రకటించింది. ప్రాణాలు హరించే ఈ వైరస్ కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాల్లోని వందల మందికి సోకింది. శనివారం నాటికి కాంగోలో మొత్తం 867 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 204 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఉగాండా సరిహద్దుల్లో తొలి కేసు..

ఈ వైరస్ తొలి కేసు ఈశాన్య కాంగోలోని యుద్ద ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో నమోదయింది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ కు తీవ్రమైన జ్వరం, వాంతులు అవడంతో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న కొన్ని రోజుల్లోనే మరణించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. సమీప బంధువులు మృతదేహాన్ని తాకడంతో కొన్ని రోజుల తర్వాత వైరస్ బారిన పడ్డారు. తొలుత జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరగా వైద్యులు వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>