శ్రీశైలంలో చిరుత కలకలం..

కలం, వెబ్‌ డెస్క్ : శ్రీశైలం (Srisailam) సున్నిపెంటలోని జెన్కో కాలనీలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కాలనీలోకి ప్రవేశించిన చిరుత, ఒక ఇంట్లోని కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జరిగిన అలజడికి స్థానికులు మేల్కొనడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. జనావాసాల మధ్యకు వన్యమృగం రావడంతో జెన్కో కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>