రెచ్చిపోయిన ఆకతాయిలు.. కారు అద్దాలు ధ్వంసం చేసిన పోలీసులు!

కలం, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియా వ్యూస్ కోసం, లైక్స్ కోసం యువకులు బైకులు, కార్లతో రేసింగులు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) ఐటీ కారిడార్‌లోని నీలోఫర్ కేఫ్ (Niloufer Cafe) వీధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బైకులు కార్లతో రేసింగ్ చేస్తూ రోడ్లపై బీభత్సం సృష్టించారు.

అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లారు ఆకతాయిలు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పోలీసులు ఆ యువకుడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఆకతాయిల తీరులో మార్పు రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>