భారత్ నౌకలకు ఇరాన్ అనుమతి.. ముంబై చేరిన రెండు నౌకలు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. దీంతో గల్ఫ్ దేశాలు, ఇరాన్ నుంచి ఇండియాకు ఎలాంటి చమురు (Crude Oil) రావట్లేదు. ఈ క్రమంలో ఇండియాకు ఊరట లభించింది. ఇండియా జెండా ఉన్న నౌకలకు ఇరాన్ పర్మిషన్ ఇస్తోంది. దీంతో యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి రెండు క్రూడాయిల్ నౌకలు హర్మూజ్ జలసంధి దాటి ముంబై చేరుకున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ దేశానికి కూడా క్రూడ్ ఆయిల్ నౌకలు వెళ్లనివ్వట్లేదు ఇరాన్.

కానీ తాజాగా భారత్, ఇరాన్ విదేశాంగ శాఖల మంత్రులు చర్చలు జరపడంతో ఇరాన్ మన దేశం జెండా ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఇండియాకు క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొద్దికొద్దిగా జరుగుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే ఇండియాకు క్రూడ్ ఆయిల్  (Crude Oil) సమస్య తీరిపోయినట్టే అవుతుందని అంటున్నారు. అటు కేంద్రం కూడా తాము ఇరాన్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.

Read Also: యుద్ధం ఎఫెక్ట్.. ఆ రెండు జిల్లాల్లోని గ్రానైట్ బిజినెస్ డౌన్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>