Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: వేముల వీరేశం

కలం, రామన్నపేట: రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం (Vemula Veeresham) ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట పట్టణం, దుబ్బాక, మునిపంపుల, ఎన్నారం గ్రామాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, అక్కడ జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, నిర్వాహకులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని కనీస సౌకర్యాలు (తాగునీరు, నీడ, తార్పాలిన్లు తదితర) కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే (రవాణా) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని, ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Read Also: భారీ శుభవార్త.. జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>