Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌కు రావొద్దు.. భారత ఎంబసీ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని (Iran) భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ‘ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇరాన్‌కు రావొద్దు, ప్రయాణాలు రద్దు చేసుకోండి, ఇప్పటికే ఎవరైనా ఇరాన్‌కు వచ్చి ఉంటే సురక్షిత మార్గాల ద్వారా వెంటనే తిరిగి వెళ్లిపోండి. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు’ అని టెహరాన్‌లోని దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఇరాన్‌ దేశంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్కడ ఉంటున్న భారత పౌరులు బయటకు రావొద్దని.. ఏదైనా సాయం కావాలంటే ఎంబసీ కార్యాలయాన్ని ఫోన్‌లో సంప్రదించాలని సూచించింది.

మళ్లీ భీకరంగా దాడులు..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఇరాన్‌కు మద్దతుగా ఉన్న లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ప్రతి దాడి కోసం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అమెరికా కూల్చేసింది. అణ్వస్త్రాలు, హర్మూజ్ జలసంధి వంటి అంశాల్లో అగ్ర రాజ్యం డిమాండ్లను టెహరాన్ ఏమాత్రం అంగీకరించకపోవడంతో చర్చల్లో పీఠముడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>