రేపటి నుంచే జనగణన తొలిదశ: తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే ?

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా రేపటి నుంచి జనగణన (India Census 2026) తొలి దశ ప్రక్రియ ప్రారంభం కానునున్నది. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ భారీ ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహ గణనపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుండి మే 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుండగా, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ గణన కొనసాగుతుంది.

ప్రజల నుంచి సేకరించే వ్యక్తిగత సమాచారం విషయంలో కేంద్రం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. డేటా గోప్యతకు పూర్తి భద్రత కల్పిస్తామని, సమాచారం దుర్వినియోగం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ జనగణన ప్రక్రియలో రెండో దశ అత్యంత కీలకం కానుంది, ఎందుకంటే ఆ సమయంలోనే కులం వివరాల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ వివరాలు ప్రధాన భూమిక పోషించనున్నాయి. ప్రజలందరూ ఈ ప్రక్రియకు సహకరించి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>