Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గత రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 గంటల్లో అంటే ఉదయం 8-10 గంటల మధ్య సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు (Rain Alert) పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో రాబోయే 2 గంటల్లో జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయని పేర్కొంది. రాబోయే 2 గంటల్లో పెద్దాపల్లి, జనగాం, సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నలను ఆగం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించిందని హైదరాబాద్ వాసులు అనుకుంటున్నారు. అటు రైతన్నలు మాత్రం భారీ వర్షాలకు పంట నష్టం పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు తమను నిండా ముంచాయని వరి, మామిడి రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి. ఈదురుగాలులు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపునకు వర్షాలు విస్తరిస్తున్నాయి. దీంతో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ లో వాతావరణం చల్లబడి ఈదురుగాలులు వీస్తున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>