కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశను టీమిండియా విజయంతో ముగించింది(India Beat Netherlands). ఇప్పటికే సూపర్–8 దశకు చేరుకున్న భారత్.. బుధవారం నామమాత్రమైన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె(66; 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 176/7 పరుగులకు పరిమితం చేసి, 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అభిషేక్ త్రిబుల్ డక్..
భారత్ ఇన్నింగ్స్‌లో ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కాసేపటికే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(18; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సైతం పెవిలియన్‌కు చేరాడు.
ఈ దశలో తిలక్ వర్మ(31; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(34; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ పరుగులు రావడం మందగించింది. అయితే, వీళ్లిద్దరూ ఔటయ్యాక శివమ్ దూబెకు తోడు హార్థిక్ పాండ్యా(30; 21 బంతుల్లో 3 సిక్స్‌లు) ఆఖర్లో బ్యాట్ ఝలిపించడంతో ప్రత్యర్థికి భారత్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రింకూ సింగ్ (6; 3 బంతుల్లో 1 సిక్స్) నాటౌట్‌గా నిలిచాడు. వాన్‌బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు. కైల్ క్లెయిన్కు 1 వికెట్ దక్కింది.
ఛేదనలో నెదర్లాండ్స్ పోరాటం ఆకట్టుకుంది. ఆ జట్టు అన్ని ఓవర్లూ ఆడి 176/7 స్కోరు చేసింది (India Beat Netherlands). బాస్ డి లీడె (33) టాప్ స్కోరర్. అతనితోపాటు మరో ఆరుగురు రెండంకెల స్కోరు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, శివమ్ దూబె 2 వికెట్లు తీశారు. బుమ్రా, హార్ధిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన శివమ్ దూబెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
Read Also: ‘దానం’ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే స్పీకర్ డెసిషన్
Follow Us On: Instagram


