కలం, డెస్క్ : జనగామ మున్సిపాలిటీలో (Jangaon Municipality) హంగ్ రావడంతో అన్ని పార్టీలకు టెన్షన్ మొదలైంది. మొత్తం 30 వార్డులు ఉండగా.. బీఆర్ ఎస్ కు 14 స్థానాలు, కాంగ్రెస్ కు 13 స్థానాలు వచ్చాయి. నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 16 సీట్లు రావాలి. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. అన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థుల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ పార్టీలోకి రావాలని పెద్ద ఆఫర్లే చేస్తున్నారంట.
ఇలా కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు తమ వద్దకు క్యూ కడుతుండటంతో.. నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సిండికేట్ అయినట్టు సమాచారం. ఇందులో ఒక అభ్యర్థి తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని.. అప్పుడే తాము నలుగురం సపోర్ట్ చేస్తామని చెప్పేస్తున్నారంట. ఏ పార్టీ చైర్మన్ పదవి ఇస్తే ఆ పార్టీకే మద్దతు అని తేల్చి చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీల్లో మంతనాలు పెరిగిపోయాయి. చైర్మన్ పదవి కాకుండా ఇతర పదవులు ఆఫర్ చేస్తున్నాయి పార్టీలు. కానీ తమకు మాత్రం చైర్మన్ పదవే కావాలంటూ పట్టుబడుతున్నారంట. ఈ నలుగురిలో ఒకరు బీఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ కు ఇంకో రెండు సీట్లు వస్తే మున్సిపాలిటీ కైవసం అవుతుంది. దీంతో గులాబీ నేతలు పెద్ద ఎత్తున ప్రలోభాలకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం..
జనగామలో (Jangaon Municipality) ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఓట్లతో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోడానికి బీఆర్ ఎస్, కాంగ్రెస్ సిద్ధం అవుతున్నాయి. బీఆర్ ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ఈ మేరకు సన్నాహాలు మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్ కూడా ఇండిపెండెట్ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడంతో పాటు ఇటు ఎక్స్ అఫిషియో ఓట్లపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇండిపెండెంట్ అభ్యర్థుల డిమాండ్ లకు తలొగ్గుతారా.. లేదంటే ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ గిరి కైవసం చేసుకుంటారా అనేది చూడాలి.
Read Also: మధిరలో ఫలించిన భట్టి వ్యూహం.. బీఆర్ఎస్‌కు ఒక్క స్థానమే
Follow Us On : WhatsApp


