మధిరలో ఫలించిన భట్టి వ్యూహం.. బీఆర్ఎస్‌కు ఒక్క స్థానమే

కలం/ఖమ్మం బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మధిర మున్సిపాలిటీలో సత్తా చాటారు. ఈ మున్సిపాలిటీ మీద మొదటి నుంచి ఫోకస్ పెట్టిన భట్టి అనుకున్న ఫలితాన్ని సాధించారు. రాజకీయ పొత్తులు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచారం, అభివృద్ధి ఎత్తుగడ ప్రతి అంశంలో భట్టి వ్యూహాలు రచించి ముందుకు సాగారు.

మొత్తం 22 స్థానాలకుగాను కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. డిప్యూటీ సీఎం భట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలను, అభ్యర్థులను సమన్వయం చేసుకొని ముందుకు సాగారు. మధిర నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఈ పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? అన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

స్వచ్ఛ సుందరమైన, మధిర కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్తు, వరద నీటి ఇబ్బంది లేకుండా వైరా నదికి అడ్డంగా కరకట్ట, మధిర పట్టణ విస్తరణకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్డు వంటి పనులకు అనుమతులు సాధించి వేగంగా పనులు చేపడుతున్న తీరును వివరించారు. మొత్తంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యూహం ఫలించింది.

Read Also: ఒక్క ఓటుతో గెలిచిన అదృష్టవంతులు వీరే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>