epaper
Wednesday, February 18, 2026
epaper

సూర్యాపేటలో కంగుతిన్న జగదీశ్ రెడ్డి.. 11 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో (Suryapet Municipality) సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి మూడు విడతలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సొంత నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేట మున్సిపాలిటీ పీఠాన్ని కోల్పోయారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 31 వార్డు స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ 11 వార్డు స్థానాలను గెలుచుకోగా, బిజెపి ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మరో ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులుగా విజయం సాధించారు.

అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సూర్యాపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంటానని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సూర్యాపేటను అభివృద్ధి చేసింది తానేనని.. తాను చెప్పిందే వేదంగా మారుతుందని ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. కానీ తీరా మున్సిపల్ ఫలితాల విషయానికి వచ్చేసరికి బొక్కబోర్లా పడ్డారు. మున్సిపాలిటీలో కనీసం సగం స్థానాలను కూడా దక్కించుకోలేక చేతులెత్తేశారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరిని కూడా సెకండ్ స్థాయి లీడర్ గా గుర్తింపు దక్కకుండా చేయడంలో జగదీశ్ రెడ్డి కుట్రపన్నారనే వాదనలు పెద్ద ఎత్తున ఉన్నాయి.

ఇప్పటివరకు సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరంటే ఒక్కరిని కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గుర్తించలేని పరిస్థితికి జగదీష్ రెడ్డి పార్టీని నేతలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా సూర్యాపేటలో జగదీశ్ రెడ్డిని డామినేట్ చేసే పరిస్థితి ఏమాత్రం కనిపించినా అతన్ని పాతాళానికి తొక్కుతారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని నామమాత్రపు కాండిడేట్ కు ఇచ్చి ఐదేళ్ల పాలనను మంత్రంగా నడిపించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రికి సూర్యాపేట ఓటర్లు ఝలక్ ఇచ్చారు.

మరోవైపు మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి (Minister Uttam) సూర్యాపేట మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించాయి. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి గెలిస్తే గెలిచి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటే కాంగ్రెస్ లీడర్లు అభ్యర్థులని తిప్పుకుంటారని గత మూడు రోజులుగా జగదీష్ రెడ్డి క్యాంప్ రాజకీయాలకు తెరలేరు తీరా చూస్తే ఆశలన్నీ గల్లంతయ్యాయి.

Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘హంగ్’ టెన్షన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>