దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : గుండా మనోహర్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని వారి ఆశయాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, షేక్ ఫరూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>