రూ.7.95 కోట్లతో ఎంవీఎస్ కళాశాల నూతన భవనం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ పట్టణంలోని చారిత్రాత్మక ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (MVS Government Junior College) రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం రూ.7.95 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అతి త్వరలోనే భూమిపూజ చేయనున్నారు.

ఎంవీఎస్ జూనియర్ కళాశాల భవన నిర్మాణ ప్రాజెక్టు

విశాల ప్రాంగణం ఏకంగా 6 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 7.95 కోట్ల భారీ నిధులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆధునిక వసతులుతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విశాలమైన క్లాస్‌రూమ్‌లు, ప్రత్యేక పరిపాలనా విభాగాలు అత్యాధునిక ల్యాబ్‌లు,సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు హైటెక్ ప్రయోగశాలల ఏర్పాటు కానున్నాయి.

డిజిటల్ విద్య , లైబ్రరీ విశాలమైన రీడింగ్ రూమ్‌తో కూడిన అత్యాధునిక గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ క్లాస్‌రూమ్‌లు, నిరంతర శుద్ధ తాగునీరు, బాలబాలికలకు ప్రత్యేక శౌచాలయాలు, క్రీడా మైదానం అభివృద్ధి తదితర వసతులతో ఎంవీఎస్ కళాశాలను నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>