మాణిక్యం ఠాగూర్ కృషితో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు: TPCC చీఫ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ మాణిక్యం ఠాగూర్ పై టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశంశల జల్లు కురిపించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు విచ్చేసిన మాణిక్యం ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా శాలుగా కప్పి సన్మానించారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాణిక్యం ఠాకూర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

మాణిక్యం ఠాగూర్ 2020 లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌గా పని చేశారని.. ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఆ నాడు మాణిక్యం ఠాగూర్ తీసుకున్న నిర్ణయం తోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని పీసీసి అధ్యక్షుడిగా మాణిక్యం ఠాకూర్ నియమించడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. భారత్ జోడో యాత్ర చేపట్టడం.. ఆ యాత్రలో తమ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత ఎంతో చరిత్ర కలిగిన గాంధీ భవన్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ముందుకు పోతుందని కొనియాడారు. కాగా, మాణిక్యం ఠాగూర్‌ 2020 సెప్టెంబర్‌ నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>