Mobile Popup Ad
Mobile Popup Ad

హైవేపై బీభత్సం.. ట్రక్ ను వరుసగా ఢీకొన్న ఏడు కార్లు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా హైవే పై ఓ ట్రక్ బీభత్సం సృష్టించింది. ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రాయన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన శ్రేణిలో టైర్ పేలి పోవడంతో ఒక్కసారిగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లకు యాక్సిడెంట్ అయింది.

కార్ల వెనుక వచ్చిన కొబ్బరి బొండాల లారీ కార్లను పక్క నుండి ఢీ కొట్టుకుని పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదంలో పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగి.. ప్రాణాపాయం తప్పడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందల్ వాయి (Indalwai) పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.

Read Also: డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా నిబంధనలు సవరించిన కేంద్రం

Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>