Mobile Popup Ad
Mobile Popup Ad

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: జగన్ అరెస్ట్ అంశం గురించి ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజమండ్రిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పందించారు. ‘నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా తెలుస్తాయి. జగన్ (YS Jagan) జైలుకు వెళ్లాలని తాను అమిత్ షాను అడిగితే క్లాస్ తీసుకున్నారట. అసలు ఒకరు జైలుకు వెళితేనే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతారా..? జగన్ లాంటి వ్యక్తులు లేనప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చాను’ అని స్పష్టం చేశారు.

మిగతావారు మాట్లాడటం లేదా..?

రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తాను పదే పదే కులం గురించి మాట్లాడుతుంటానని విమర్శిస్తుంటారని.. మిగతా నాయకులు ఎవరూ కులాల గురించి మాట్లాడటం లేదా.. అని ప్రశ్నించారు. తనకు గత్యంతరం లేకనే, ఓపికతో ఇలాంటి విమర్శలు భరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ.. వారిని చూస్తే తనకు అసూయగా ఉందని.. ఎంతో సాఫీగా ఎన్నికలు సాగిపోయాయయని వివరించారు.

Read Also: ప్ర‌తి పంచాయ‌తీలో దేశీయ వ‌నాల ఏర్పాటు: పవన్ కల్యాణ్

Read Also: లగ్జరీ వెడ్డింగ్స్.. అప్పులు చేసి మరీ వేడుకలు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>