కలం, వెబ్ డెస్క్ : అనుమానం అనే పెను భూతం ఒక పెద్ద దెయ్యంలా మనల్ని పట్టి పీడిస్తుంది. అది మన మనసులో చేరితే సంతోషాన్ని, ప్రశాంతతను నాశనం చేస్తుంది. చివరకు ఎదుటివారి ప్రాణాలు తీస్తుంది.. ఇలాంటి సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే.. కుమారుడిని హత్య చేసిన విషాద ఘటన మెదక్ (Medak) జిల్లా పెద్దబాయి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్ కు అదే మండలానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఆరేళ్ల క్రితం జరిగిన వివాహ బంధంలో వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
కూలి పనులు చేసుకుంటూ దంపతులిద్దరూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భాస్కర్ తన భార్యపై చేయి చేసుకున్నాడు. ఆమెకు గాయాలు కావడంతో మెదక్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోని.. కుమారుడిని తండ్రి వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిపై ఉన్న కోపంతో.. తనకు బాబు పుట్టలేదనే అనుమానంతో తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్(Medak) ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొడుకును హత్య చేసిన భాస్కర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read Also: తండ్రి, భార్యలే నిందితులు.. అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు!
Follow Us On: X(Twitter)


