అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

కలం, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Rain Alert) పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తాయని తెలిపింది.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..

అటు ఏపీలోని ఉత్తరాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలలతో వర్షం పడే సమయంలో ప్రజు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ్డవద్దని సూచించింది.

Also Read : కొండా సురేఖపై వేటు తప్పదా?.. గాంధీ‌భవన్‌లో తర్జన భర్జనలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>