హాస్టల్ గోడ కూలి విద్యార్థి మృతి!

క‌లం, వెబ్ డెస్క్‌: అనంత‌పురం (Anantapur) జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లో గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక ఎస్సీ హాస్టల్ లో ఉంటూ 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, అక్ష‌య్ బ‌హిర్బూమికి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఒక్క సారిగా గోడ కూలిపోయింది. దీంతో హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్షయ్‌కి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మృతితో కుటుంబ‌స‌భ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>