కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మార్చి 28 వరకు వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD Alert) వెల్లడించింది. మార్చి 22న, తెలంగాణలోని అక్కడక్కడా కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సూచించింది. రాబోయే రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉంది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని అక్కడక్కడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (IMD Alert) వెల్లడించింది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

