దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు పోరాడాలి: సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌

కలం, నిర్మల్‌: దోపిడీ (Exploitation) రహిత సమాజ స్థాపన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న అన్నారు. నవంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలన్న రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘం భవనంలో పార్టీ ప్రజాపంథా ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రాజన్న మాట్లాడుతూ.. పేద ప్రజలకు తిండి, ఇల్లు, బట్ట వంటి కనీస అవసరాలు కల్పించడంతో పాటు దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. వారు చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఎర్రజెండా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పార్టీ నిర్వహిస్తున్న రాజీలేని పోరాటాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామలక్ష్మణ్‌, గంగాధర్‌, సత్యం, శివలింగం, రాజేశ్వర్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>