కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలోకి కార్మికులకు కనీస వేతనాలను పెంచినందుకు రాష్ట్ర సర్కారుకు భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ (IFTU Nizamabad) జిల్లా అధ్యక్షులు బి.భూమన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శివకుమార్‌లు ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు దశాబ్దిన్నర కాలం తర్వాత అయినా కనీస వేతనాలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ పెంపుదల చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండాలని 2016లో ఇచ్చిన తీర్పుని గమనంలోకి తీసుకున్నట్టు లేదని తప్పు బట్టారు. ఏళ్ల తరబడిగా పలు హైకోర్టులలో పెండింగ్ లలో ఉన్న వాటిని సుప్రీంకోర్టు బాధ్యత తీసుకొని 2016 అక్టోబర్‌లో కనీస వేతనం రూ.26,000 ఉండాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ తీర్పును పట్టించుకోకపోవడం అత్యంత శోచనీయం అని విమర్శించారు.
అదేవిధంగా ఆర్ట్రాయిడ్ ఏదైతే సూచన చేశాడో ఆ సూచనలు కూడా ఇక్కడ విస్మరించారని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, ఆర్ట్రాయిడ్ ఇచ్చిన ప్రమాణాల ప్రకారం కనీస వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరపున బి. భూమన్న, ఎం. శివకుమార్ లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముల్లె హమాలీ అధ్యక్షుడు ఎ. మోహన్, నాయకులు బి. శంకర్, రమేష్, తొంపే రాజు, దాసు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

