కలం వెబ్ డెస్క్ : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మకు సంబంధించిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ రవి(iBomma Ravi)ని నేటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు మళ్లీ విచారణకు అనుమతించాలని ఇటీవల నాంపల్లి కోర్టు(Nampally Court)ను కోరారు.
ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మొత్తం 12 రోజుల విచారణకు కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు నేడు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ విచారణలో మనీ ల్యాండరింగ్, ఆర్థిక లావాదేవీలు, దీని వెనుక ఇంకా ఎంతమంది సభ్యులున్నారనే కోణంలో విచారణ చేపట్టనున్నారు.
Read Also: ది రాజాసాబ్ ఈవెంట్‌లో తీవ్ర ఇబ్బందికి గురైన నిధి అగర్వాల్
Follow Us On: Youtube


