సీఎం పదవికి రాజీనామా.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) లో కీలక ఘట్టం ముగిసింది. కొన్నాళ్లుగా కొనసాగుతున్న సీఎం మార్పు అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధ రామయ్య (Siddaramaiah) రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ లో గవర్నర్ సెక్రటరీకి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సూచనలతోనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ అమోదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ బద్ధంగా గవర్నర్ రాజీనామాను ఆమోదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జాతీయ రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. నేషనల్ పాలిటిక్స్ లోకి రావాలన్న అధిష్ఠానం సూచనలను ఆయన వ్యతిరేకించారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు కర్ణాటక ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే కు సిద్ధరామయ్య (Siddaramaiah) ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు.

Read Also: హైదరాబాద్‌లో నేపాలీల ఆగడాలు.. యువతి చేయి పట్టి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>