హైడ్రా మెగా ఆపరేషన్​.. ఐలాపూర్ లో టెన్షన్..టెన్షన్ !

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ మండలంలోని ఐలాపూర్ (Ailapur) గ్రామంలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. హైడ్రా చరిత్రలోనే భారీ ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తున్న ఈ కూల్చివేతల పర్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో మోహరించిన హైడ్రా సిబ్బంది, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియ సాగుతోంది.

గత కొద్దిరోజులుగా ఐలాపూర్ పరిధిలోని ప్రభుత్వ, ఇనాం భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపిన హైడ్రా అధికారులు, గ్రామం మొత్తం ఎఫ్ టీ ఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డాయి. ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుని వెంటనే ఫెన్సింగ్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గత వారమే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు హైకోర్టు లాయర్ ముఖిమ్ ప్రెస్ మీట్ నిర్వహించి, ఐలాపూర్ గ్రామాన్ని కాపాడుకోవాలని, హైడ్రా చర్యలను అడ్డుకోవాలని స్థానికులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా వెయ్యి మందికి పైగా సిబ్బందిని మోహరించి హైడ్రా (HYDRA) తన పట్టు నిరూపించుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందుగానే మీడియాను పక్కకు పంపించి, ఇళ్లను ఖాళీ చేయిస్తూ భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>