ఉగ్ర లింకుల కేసులో హైద‌రాబాద్ మ‌హిళ‌ అరెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: విజ‌య‌వాడ‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఉగ్ర లింకుల (Terror Links) కేసులో కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ అధికారులు మ‌రొక‌రిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విజ‌య‌వాడ‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారించి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టారు. బీహార్‌, హైద‌రాబాద్‌ (Hyderabad)కు చెందిన ఇద్ద‌రు ఈ ముఠాలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న‌ట్లు గుర్తించారు. తాజాగా హైద‌రాబాద్‌కు చెందిన స‌యీదా బేగంను అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం అధికారులు ఆమెను విచారిస్తున్నారు. యువ‌కుల‌ను తీవ్ర వాద సంస్థ‌ల వైపు మ‌ళ్లించ‌డంలో స‌యీదా బేగం కీల‌క పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు విజ‌య‌వాడ ఉగ్ర లింకుల కేసులోనూ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. పోలీసుల విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఉగ్ర లింకుల నేప‌థ్యంలో 2025 జూన్‌లో గుజ‌రాత్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అప్ప‌టి నుంచి పోలీసులకు అనుమానం రాకుండా ఈ గ్యాంగ్ జాగ్ర‌త్త ప‌డుతోంది. ఈ గ్యాంగ్‌లో మొత్తం 12 మంది కీల‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో విజ‌యవాడ‌లో అరెస్ట్ అయిన ముగ్గురు ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో 12 మంది స‌భ్యులున్నారు. బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్, ఢిల్లీలో వీరి కార్య‌క‌లాపాల‌కు సిద్ధ‌మ‌య్యారు. బీహార్ నుంచి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న దిల్కాష్ స‌హా మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>