ఇంజినీరింగ్​ కాలేజీలో దారుణం: విద్యార్థినిపై రెండేళ్లుగా అఘాయిత్యం

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ (VNR College)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవాల్సిన క్లాస్ రూమ్‌లోనే ఒక విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన ఆశిష్ అనే యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గత రెండేళ్లుగా సదరు యువతిని బెదిరిస్తూ ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఆశిష్ డార్క్ వెబ్‌సైట్‌ను అడ్డాగా చేసుకుని, అక్కడ ఆర్డర్ చేసి మరీ మత్తు కలిపిన చాక్లెట్లను తెప్పించినట్లు సమాచారం. ఈ చాక్లెట్లను బాధితురాలికి తినిపించి, ఆమె స్పృహలో లేని సమయంలో నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు.

ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్ల నుంచి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాకుండా, బాధితురాలు గర్భం దాల్చకుండా ఉండేందుకు ఆమెకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలతో పాటు పలు రకాల మత్తు పదార్థాలను కూడా తినిపించినట్లు సమాచారం. ఈ మందులు, మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల బాధితురాలు తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. అత్యాచారం జరిగిన విషయం తెలిసినప్పటికీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>